మా గురించీ

ప్రస్తుతం అన్యమతముల ప్రాబల్యం బాగా పెరిగి సనాతనమైన మన హిందూ ధర్మాన్ని ఒక దెయ్యం లాగా {సైతాన్} భావితరాలకు చూపించే ప్రయత్నాలు అహర్నిశలు చేస్తున్నారు. వారు బస్టాండ్ ,రైల్వే స్టేషన్ ఆసుపత్రులు, మన దైవ మందిరాల వద్ద కొంచెం నీరసంగా అదమరపుగా ఉన్నవారిని చిన్న చిన్న బాధాలలో వున్న వారిని లక్ష్యంగా చేసుకుని వారి మనసు లో విష బీజాలు నాటుతున్నారు . విద్యాలయాలు మరియు ఆసుపత్రుల పేరుతో చిన్న చిన్న ఉపశమనములు చేసి మన భావితరాల పిల్లల మనసులు మళ్లించడమే కాక విభజించి పాలించు అనే బ్రిటిష్ సంస్కృతిని మరో విధంగా(భార్య ,భర్త ల మద్య మాత మార్పిడి ) తీసుకుని వచ్చారు . వారి సమస్యలు చెప్పుకోవడానికి అనేక కాల్ సెంటర్లు వెలిశాయి ప్రార్ధనల పేరుతో అనేకమందిని మత మార్పిడి చేస్తున్నారు . అందుకే వారిని ఎంతో కొంత కట్టడి చేయడం కోసం మా ఈ చిరు ప్రయత్నమే :”హిందూ ధర్మకాల్ సెంటర్ “.ఇలాంటి సంస్థలు భవిష్యత్ లో ఎన్నో ఏర్పడి మన ధర్మాన్ని కాపాడాలనేదే మా ఆకాంక్ష .